“ఎర్రబస్సు రాని చోట ఎయిర్‌బస్సు వచ్చింది”.. భోగాపురం ఎయిర్‌పోర్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

BC7News
By
1 Min Read

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలను నిజం చేసే ప్రాజెక్టుగా దీనిని అభివర్ణించిన ఆయన, విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

“రెండేళ్ల క్రితం సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని చూశాం. ఇప్పుడు పునర్నిర్మాణ దిశగా వేగంగా ముందుకు వెళ్తున్నాం. ఎర్రబస్సు కూడా రాదన్న ప్రాంతంలో నేడు అంతర్జాతీయ ఎయిర్‌బస్సులు దిగే విమానాశ్రయం నిర్మించాం” అని సీఎం అన్నారు.

గతంలో ఉత్తరాంధ్రను తక్కువగా చూసినవారు ఇప్పుడు రాజకీయంగా కనిపించడం లేదని పరోక్ష విమర్శలు చేశారు. అనేక సవాళ్లను అధిగమించి ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

జీఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మించడం, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించిన ఈ కలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముందుకు తీసుకెళ్లడం ఉత్తరాంధ్రకు గర్వకారణమని చంద్రబాబు అన్నారు.

image

భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలకు కొత్త ఊపు వస్తుందని తెలిపారు. గూగుల్‌తో పాటు స్టీల్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను అంతర్జాతీయ పెట్టుబడుల మ్యాప్‌పై నిలబెడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article