అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరూ “దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి ఏం చేయగలను?” అనే ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించాలని సీఎం ఆకాంక్షించారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి దేశం, రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి సమృద్ధిగా మారాలని అన్నారు.

అమరావతిలో జరిగిన వేడుకల్లో భారీ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Slug: chandrababu-independence-day-speech-2047-swarna-andhra-amaravati