తెలంగాణ రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక షెడ్యూల్‌ను వెల్లడించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలతో పాటు దసరా సెలవుల తేదీలను ప్రకటించింది.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు SA-1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.

తరగతుల వారీగా పరీక్షల సమయాలు
- 1 నుంచి 5వ తరగతి: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
- 6, 8వ తరగతులు: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
- 7వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు
- 9వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు
- 10వ తరగతి: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు
తరగతుల వారీగా సబ్జెక్టుల పరీక్ష తేదీలతో కూడిన పూర్తి టైమ్‌టేబుల్‌ను కూడా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు షెడ్యూల్‌ను పరిశీలించి ముందస్తుగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది. ఉపాధ్యాయులు కూడా పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ పేర్కొంది.