సంగారెడ్డి: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెదకంజర్ల గ్రామ శివారులోని నేరేడు చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా శిరీష అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
గణేశ్ విగ్రహ నిమజ్జనం కోసం అనాథాశ్రమానికి చెందిన విద్యార్థులు నేరేడు చెరువు వద్దకు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కొందరు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. ఒకరి తర్వాత ఒకరు నీటిలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది.

సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చేపట్టి విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులను నర్సింహ రాజు, సుమంత్, గణేశ్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్ధార్థ్గా గుర్తించారు. వీరిలో సుమంత్, గణేశ్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్ డిప్లొమా చదువుతుండగా.. సిద్ధార్థ్ 10వ తరగతి చదువుతున్నట్లు సమాచారం.
ఆసుపత్రికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఘటన విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించారు. ఘటనపై తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు,