హరారేలో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదరగొట్టింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాది మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ 13.2 ఓవర్లలోనే 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు అభిషేక్ శర్మ రూపంలో తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 నాటౌట్, తిలక్ వర్మ 6 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

అంతకుముందు భారత బౌలర్లు జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వెస్లీ మధెవెరె, తడివానశే మరుమాని కొంతసేపు పోరాడినా జట్టు స్కోరును భారీగా పెంచలేకపోయారు. చివరికి జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది.
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.