bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. జింబాబ్వేపై భారత్ ఈజీ… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 24 Jul 2026, 8:52 am  |  Posted by : BC7NEWS
👁 10 💬 0
Sports

19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. జింబాబ్వేపై భారత్ ఈజీ విక్టరీ

19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. జింబాబ్వేపై భారత్ ఈజీ విక్టరీ

హరారేలో జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా అదరగొట్టింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం బాది మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ 13.2 ఓవర్లలోనే 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు అభిషేక్ శర్మ రూపంలో తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి భారత విజయానికి బాటలు వేశాడు. ఇషాన్ కిషన్ 35 పరుగులతో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 నాటౌట్, తిలక్ వర్మ 6 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.

అంతకుముందు భారత బౌలర్లు జింబాబ్వే బ్యాటర్లను కట్టడి చేశారు. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వెస్లీ మధెవెరె, తడివానశే మరుమాని కొంతసేపు పోరాడినా జట్టు స్కోరును భారీగా పెంచలేకపోయారు. చివరికి జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.