Slug: amazon-layoffs-over-1000-employees-ai-investment

BC7News
By
1 Min Read

అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్.. వెయ్యి మందికి పైగా ఉద్యోగులపై వేటు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని అమెజాన్ రిటైల్ విభాగాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపినట్లు రాయిటర్స్, బిజినెస్ ఇన్‌సైడర్ నివేదికలు వెల్లడించాయి.

అమెజాన్‌కు చెందిన ‘స్టోర్స్’ బిజినెస్‌లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీ ప్రతినిధి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా స్టోర్స్ విభాగంలో కొన్ని సర్దుబాట్లు చేసినట్లు తెలిపారు. అయితే, తొలగించిన ఉద్యోగుల కచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు.

30 వేల ఉద్యోగాల కోతకు ప్రణాళిక?

అమెజాన్ చేపట్టిన తాజా లేఆఫ్స్.. రానున్న రోజుల్లో సుమారు 30 వేల ఉద్యోగాలను తగ్గించాలనే విస్తృత ప్రణాళికలో భాగమని తెలుస్తోంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు భారీగా డిమాండ్ పెరగడంతో అమెజాన్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేస్తున్నట్లు సమాచా

image
📄 Generate e-Paper Clip
Share This Article