హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్‌తో పాపులర్ అయిన కుమారి ఆంటీ పేరు మరోసారి సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈసారి ఆమె ఫుడ్ బిజినెస్ వల్ల మాత్రమే కాదు.. సినిమా ఎంట్రీతోనూ వార్తల్లో నిలిచారు. ‘పాంచాలి పంచభర్తృక’ సినిమాతో వెండితెరపైకి అడుగుపెడుతున్న కుమారి ఆంటీ.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించారు.
‘‘సినిమా చూసి టికెట్ తీసుకొచ్చి నా ఫుడ్ స్టాల్‌లో చూపిస్తే.. బిల్లులో రూ.100 తగ్గిస్తా’’ అంటూ ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కుమారి ఆంటీ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. సినిమా ప్రమోషన్‌తో పాటు తన ఫుడ్ స్టాల్‌కు కూడా ప్రచారం కల్పించేలా ఆమె చేసిన ఈ ఆఫర్‌పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
తనకు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని కుమారి ఆంటీ చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన గుర్తింపే తనను సినీ పరిశ్రమకు తీసుకొచ్చిందని తెలిపారు. ‘పాంచాలి పంచభర్తృక’లో అవకాశం కల్పించిన దర్శకుడు గంగ సప్తశిఖర, నిర్మాతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. రోల్ రైడా, జెమినీ సురేశ్ తదితరులు నటించారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో కుమారి ఆంటీకి ఉన్న క్రేజ్‌కు తోడు.. సినిమా టికెట్‌పై రూ.100 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడంతో ‘పాంచాలి పంచభర్తృక’పై మరింత ఆసక్తి నెలకొంది.