‘జై శ్రీరామ్‌’ వివాదం.. అనసూయపై పోలీసులకు ఫిర్యాదు.. ఘాటుగా స్పందించిన నటి

BC7News
By
1 Min Read

నటి అనసూయ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. ‘జై శ్రీరామ్‌’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారని ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పేరుతో పెద్ద దొంగలు కూడా ఉన్నారంటూ అనసూయ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మతపరమైన అంశాలపై మాట్లాడే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

image

మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న అనసూయ ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్న వారిని ఉద్దేశించి ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

దీంతో అనసూయ వ్యాఖ్యలు, బీజేపీ నేతల ఫిర్యాదు, ఆమె ఇచ్చిన కౌంటర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

📄 Generate e-Paper Clip
Share This Article