హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీకి ఒకే టికెట్.. త్వరలో కామన్ మొబిలిటీ యాప్, ట్రావెల్ పాస్‌లు!

BC7News
By
1 Min Read

హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్‌తో ప్రయాణించే వ్యవస్థను తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధ్యక్షతన జరిగిన హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై కీలక చర్చ జరిగింది.

ప్రయాణికుల కోసం కామన్ మొబిలిటీ టికెటింగ్ సిస్టమ్ రూపొందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. టీజీఎస్‌ఆర్టీసీతో కలిసి ఒకే టికెట్, ఒకే మొబైల్ యాప్ ద్వారా మెట్రో, బస్సు సేవలను వినియోగించే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు.

అంతేకాకుండా మెట్రో ప్రయాణికులకు డైలీ, వీక్లీ, మంత్లీ ట్రావెల్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని కూడా పరిశీలిస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

image

మెట్రో రెండో దశ విస్తరణను దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్‌ల కొనుగోలును వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. సమావేశంలో మెట్రో ఫేజ్-2 భూసేకరణ, నిర్మాణ పనుల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు.

ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే హైదరాబాద్‌లో ప్రజా రవాణా మరింత సమర్థవంతంగా, సులభంగా మారే అవకాశం ఉంది.

📄 Generate e-Paper Clip
Share This Article