సూర్యతో సినిమాపై నోరు విప్పిన రాజమౌళి

BC7News
By
2 Min Read

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, విలక్షణ నటుడు సూర్య కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 

సూర్యతో సినిమా చేస్తే అది కచ్చితంగా చాలా ప్రత్యేకంగా (స్పెషల్) ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ విషయం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని సున్నితంగా దాటవేశారు.

ఇటీవల మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు రాజమౌళి, సూర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానమిచ్చారు. 

image

“మీరు ఈ ప్రశ్న అడుగుతారని ఊహించే ఇక్కడికి వచ్చాను. దానికి సమాధానం కూడా సిద్ధం చేసుకున్నాను. కానీ, మనం ఇక్కడికి వచ్చింది ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాను ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు నేను, సూర్య సినిమా గురించి మాట్లాడితే, అదే హెడ్‌లైన్ అవుతుంది. అసలు సినిమా పక్కకు వెళ్లిపోతుంది. అది సరికాదు” అని అన్నారు.

అదే సమయంలో అభిమానులకు భరోసా ఇస్తూ.. “మేమిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేసినా, అది కచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది” అని చెప్పడంతో సూర్య అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అంతటితో ఆగకుండా సూర్యను రాజమౌళి అభినందనలతో ముంచెత్తారు. 

ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాలతో వరుస విజయాలు సాధించడం ‘డబుల్ ధమాకా’ అని ప్రశంసించారు. అలాగే, జితూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమా ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో నటించే ఒక అవకాశాన్ని తాను కోల్పోయానని, ఆయనతో కలిసి పనిచేయాలని ఉందని పలు ఇంటర్వ్యూలలో సూర్య స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి వ్యాఖ్యలతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా రావడం ఖాయమనే అంచనాలు మరింత బలపడ్డాయి.

📄 Generate e-Paper Clip
Share This Article