జూబ్లీహిల్స్‌లో భూవివాదం కలకలం.. సినీ నిర్మాతలపై పోలీసు కేసు

BC7News
By
1 Min Read

జూబ్లీహిల్స్‌లోని ఓ విలువైన స్థలం చుట్టూ నెలకొన్న భూవివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రముఖ సినీ నిర్మాతలు సి. కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ సహా పలువురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ప్లాట్ నంబర్ 89పై యాజమాన్య వివాదం కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో జూన్ 10న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, స్థలం రవి

image

శంకర్ స్వాధీనంలోనే కొనసాగాలని, ఎవరూ అందులోకి ప్రవేశించవద్దని ఆదేశించింది.

అయినప్పటికీ కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా స్థలంలోకి ప్రవేశించి గేటు, తాళాలు ధ్వంసం చేయడం, అక్కడి వస్తువులను పాడుచేయడం, సిబ్బందిని బెదిరించడం, నిర్మాణాన్ని ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article