bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News › మోదీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర ఆరోపణలు › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 08 Oct 2026, 4:41 pm  |  Posted by : BC7NEWS
👁 2 💬 0
Latest News

మోదీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

మోదీ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఏకంగా 92 లక్షల ఓట్లను తొలగించాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండటానికి మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. లోక్‌భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా యథేచ్ఛగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు. "బీహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణను టార్గెట్ చేసింది. మోదీ, అమిత్ షా పాలనలో గత 12 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని ఆలోచించుకోవాలి" అని ఆయన అన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగానే నిరసన తెలుపుతున్నామని స్పష్టం చేశారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయన్ను పదవి నుంచి తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.