bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News › ‘ఎస్ఐఆర్’పై ప్రకాశ్ రాజ్ ఫైర్.. ‘బ్లడ్‌లెస్ జెనోసైడ్’ అంటూ సంచలన… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 11 Sep 2026, 1:13 pm  |  Posted by : BC7NEWS
👁 234 💬 0
Telangana

‘ఎస్ఐఆర్’పై ప్రకాశ్ రాజ్ ఫైర్.. ‘బ్లడ్‌లెస్ జెనోసైడ్’ అంటూ సంచలన వ్యాఖ్యలు

‘ఎస్ఐఆర్’పై ప్రకాశ్ రాజ్ ఫైర్.. ‘బ్లడ్‌లెస్ జెనోసైడ్’ అంటూ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓట్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. SIRను ‘బ్లడ్‌లెస్ జెనోసైడ్’గా అభివర్ణించిన ఆయన.. ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్ లమకాన్‌లో జరిగిన ‘ది బుక్ ఆఫ్ డిసపియరెన్స్’ తెలుగు అనువాద ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. దాదాపు 12 కోట్ల మంది ఓటర్ల పేర్లు నిశ్శబ్దంగా జాబితా నుంచి తొలగించారని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత జనాభా లెక్కలు జరుగుతాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఇదంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆయన ఆరోపించారు.

ప్రజల డేటాను ఉపయోగించి కులం, సామాజిక వర్గం, కులాంతర వివాహాలు వంటి అంశాలను గుర్తించి ప్రజలను వర్గీకరించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా ఆరోపించారు.

దేశంలో భయానక వాతావరణం నెలకొల్పడం వల్ల రచయితలు, ఫిల్మ్ మేకర్లు స్వీయ సెన్సార్‌షిప్‌కు గురవుతున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి మూకదాడుల వరకు పలు అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

పాలస్తీనా అంశంతో పాటు, సినిమా రంగంలో తనకు ఎదురైన సెన్సార్‌షిప్ అనుభవాలను కూడా ఆయన వివరించారు.