bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News › బీఆర్‌ఎస్‌ నిరసన.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 07 Sep 2026, 11:44 am  |  Posted by : BC7NEWS
👁 13 💬 0
Latest News

బీఆర్‌ఎస్‌ నిరసన.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

బీఆర్‌ఎస్‌ నిరసన.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బ్లాక్‌ డ్రెస్‌లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. నల్ల దుస్తులతో లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి సహా పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, వివేకానందరెడ్డి సహా పలువురు నేతలు టీషర్టులు విప్పేసి నిరసన తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అంటూ నిలదీశారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించకుండా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

టీషర్టులపై పోలీసులు అభ్యంతరం చెప్పడాన్ని కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ ధరిస్తే లేని అభ్యంతరం తమ విషయంలో ఎందుకని నిలదీశారు.

పిల్లలకు ఉద్యోగాలు అడిగితే విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇదేం పాలన అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత కొనసాగింది.