bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News › కొడుకు కోసం ఒక్క గంటలో ఏం చేసిందో తెలుసా? ఓటీటీలోకి… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 03 Sep 2026, 10:04 am  |  Posted by : BC7NEWS
👁 19 💬 0
Telangana

కొడుకు కోసం ఒక్క గంటలో ఏం చేసిందో తెలుసా? ఓటీటీలోకి గాల్ గాడోట్ ‘ది రన్నర్’!

కొడుకు కోసం ఒక్క గంటలో ఏం చేసిందో తెలుసా? ఓటీటీలోకి గాల్ గాడోట్ ‘ది రన్నర్’!

ఒక్క ఫోన్ కాల్.. చేతిలో కేవలం 60 నిమిషాలు.. ఆ సమయంలో కిడ్నాపర్ చెప్పిన పనులన్నీ పూర్తి చేయాలి! లేదంటే కన్న కొడుకును శాశ్వతంగా కోల్పోవాల్సిందే. ఇలాంటి ఉత్కంఠభరితమైన కథతో వచ్చిన హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది రన్నర్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 2 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎక్కడ చూడొచ్చు?

ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ తెరకెక్కించిన ‘ది రన్నర్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

అసలు కథ ఏంటి?

లండన్‌లో తన కొడుకుతో జీవించే ఓ మహిళ అతడిని స్కూల్‌లో దింపి ఇంటికి వస్తుంది. కానీ ఆ తర్వాత ఆమె జీవితమే ఒక్కసారిగా మారిపోతుంది. ఓ కిడ్నాపర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో ఆమెకు షాక్ తగులుతుంది.

తన కొడుకు తన దగ్గరే ఉన్నాడని చెప్పే కిడ్నాపర్.. గంటలోపు తాను చెప్పిన పనులన్నీ చేయాలని షరతు పెడతాడు. ఒక్క పని తప్పినా బాలుడి ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తాడు.

ఇక తన కొడుకును కాపాడుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది? కిడ్నాపర్ పెట్టిన షరతులను అంగీకరించిందా? గంట వ్యవధిలో ఆమె ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంది? చివరికి తన కొడుకును కాపాడుకోగలిగిందా?

ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ‘ది రన్నర్’ను చూడాల్సిందే. వీకెండ్‌లో ఓటీటీలో ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి ఈ సినిమా ఆసక్తికరమైన ఆప్షన్.