bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News‘భూ లక్ష్మి’ పథకం ప్రకటించిన కల్వకుంట్ల కవిత › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 18 Aug 2026, 3:01 pm  |  Posted by : BC7NEWS
👁 5 💬 0
Latest News

‘భూ లక్ష్మి’ పథకం ప్రకటించిన కల్వకుంట్ల కవిత

‘భూ లక్ష్మి’ పథకం ప్రకటించిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ను అమలు చేసి, భూమి లేని పేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి అందిస్తామని వెల్లడించారు.

బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రికి భూమి అంటే వ్యాపార లావాదేవీలుగా కనిపించవచ్చని, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి జీవనాధారమని అన్నారు.

రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ముందుగా పేదల అసైన్డ్ భూములనే సేకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుందని విమర్శించారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పేదల అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కవిత ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ హామీని వెంటనే అమలు చేయాలని సవాల్ విసిరారు.

ప్రభుత్వ నియామకాలు, కేబినెట్ కూర్పు, సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్ల నియామకాలలో బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం పేరుతో అసమానతలు కొనసాగుతున్నాయని విమర్శించారు.