bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsతెలంగాణలో కొత్త ‘ఫోటో వార్’.. బీజేపీ పోస్టుకు బీఆర్ఎస్ కౌంటర్! › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 15 Aug 2026, 10:47 am  |  Posted by : BC7NEWS
👁 8 💬 0
Telangana Politics

తెలంగాణలో కొత్త ‘ఫోటో వార్’.. బీజేపీ పోస్టుకు బీఆర్ఎస్ కౌంటర్!

తెలంగాణలో కొత్త ‘ఫోటో వార్’.. బీజేపీ పోస్టుకు బీఆర్ఎస్ కౌంటర్!

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా కొత్త తరహా రాజకీయ యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు ఇప్పుడు ఎడిట్ చేసిన ఫొటోల రూపంలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా తెలంగాణ బీజేపీ “వన్ టీమ్, వన్ మిషన్ – వికసిత్ తెలంగాణ” అనే క్యాప్షన్‌తో బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితర నేతల గ్రూప్ ఫొటోను ‘ఎక్స్’లో పోస్టు చేసింది.

దీనికి బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. అదే ఫొటోను ఎడిట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రాన్ని జోడించి “అసలు వ్యక్తిని మర్చిపోయారేంటి?” అంటూ వ్యంగ్యంగా పోస్టు చేసింది.

రేవంత్ రెడ్డి, బీజేపీ ఒక్కటేనన్న రాజకీయ సందేశాన్ని ఇచ్చేలా బీఆర్ఎస్ ఈ పోస్టును రూపొందించింది. దీంతో తెలంగాణలో ‘ఫోటో వార్’ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.