bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsచరిత్రలో తొలిసారి ఎర్రకోటపై వందేమాతరం.. మోదీ సంచలన ప్రసంగం! › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 15 Aug 2026, 9:31 am  |  Posted by : BC7NEWS
👁 9 💬 0
National Issues > National Politics

చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై వందేమాతరం.. మోదీ సంచలన ప్రసంగం!

చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై వందేమాతరం.. మోదీ సంచలన ప్రసంగం!

80th Independence Day Live Updates: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఎర్రకోట వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం ఆలపించడం చారిత్రక ఘట్టంగా నిలిచింది.

తన ప్రసంగంలో ప్రధాని మోదీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రస్తావించారు. దేశ ఆర్థిక, సాంకేతిక, రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి ‘సప్తధార’ వ్యూహాన్ని వివరించారు.

సప్తధారలో కీలక అంశాలు:

  • తయారీ శక్తి
  • ఆహార ఉత్పత్తి
  • టెక్నాలజీ, ఏఐ, ఇన్నోవేషన్
  • గతిశక్తి, వేగవంతమైన కనెక్టివిటీ
  • రక్షణ రంగంలో ఆత్మనిర్భరత
  • గ్రీన్, బ్లూ ఎకానమీ
  • యువశక్తి

భారత్‌ను గ్లోబల్ సప్లై చైన్‌లో కీలక భాగస్వామిగా తీర్చిదిద్దాలని, ప్రపంచ మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు మరింత నాణ్యత తీసుకురావాలని మోదీ పేర్కొన్నారు. యువత దేశ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాకారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.