bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsబెంగళూరు బీసీ డిక్లరేషన్.. బీసీల హక్కుల కోసం 10 కీలక… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 10 Aug 2026, 4:43 pm  |  Posted by : BC7NEWS
👁 13 💬 0
Telangana

బెంగళూరు బీసీ డిక్లరేషన్.. బీసీల హక్కుల కోసం 10 కీలక తీర్మానాలు

బెంగళూరు బీసీ డిక్లరేషన్.. బీసీల హక్కుల కోసం 10 కీలక తీర్మానాలు

నవంబర్‌లో లక్ష మందితో పార్లమెంట్ మార్చ్.. దేశవ్యాప్తంగా ఉద్యమ విస్తరణకు నిర్ణయం

బెంగళూరు: దేశవ్యాప్తంగా బీసీల హక్కులు, సామాజిక న్యాయం, కులగణన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బెంగళూరులో జరిగిన జాతీయ ఓబీసీ మహాసభ నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ ప్రతినిధులు, నాయకులు ఈ మహాసభకు హాజరయ్యారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదికపై పాల్గొని బీసీల సమస్యలు, హక్కులు, కులగణన తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

మహాసభలో ‘బెంగళూరు బీసీ డిక్లరేషన్’ పేరుతో బీసీల హక్కుల కోసం 10 కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు బీసీల జనాభా లెక్కలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు, సామాజిక న్యాయం అందే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

నవంబర్‌లో లక్ష మందితో పార్లమెంట్ మార్చ్

బీసీ హక్కుల సాధన కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్‌లో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్ష మంది బీసీలను సమీకరించి పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని మహాసభ నిర్ణయించింది. కులగణన, బీసీ హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి అంశాలను జాతీయ స్థాయిలో మరింత బలంగా వినిపించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ ఉద్యమం

బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బస్సు యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు. ఏపీ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు, గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు బీసీలను ఏకం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బీసీల హక్కులు, కులగణన ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఉజ్జయినిలో 12వ జాతీయ ఓబీసీ మహాసభ

తదుపరి 12వ జాతీయ ఓబీసీ మహాసభను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, నాయకులు, ప్రతినిధులను ఈ మహాసభకు సమీకరించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.

“రాష్ట్రాలు వేరైనా.. బీసీలంతా ఒక్కటే”

బెంగళూరు మహాసభ బీసీ ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రాలు వేరైనా బీసీలంతా ఒక్కటేనని, బీసీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అంబేద్కర్ అందించిన రాజ్యాంగ మార్గంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, కులగణన, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.

బీసీ మహాసభ కీలక నిర్ణయాలు

🔴 బెంగళూరు బీసీ డిక్లరేషన్
🔴 10 కీలక తీర్మానాల ఆమోదం
🔴 నవంబర్‌లో లక్ష మందితో పార్లమెంట్ మార్చ్
🔴 దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్
🔴 బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరణ
🔴 ఏపీ నుంచి యూపీ వరకు బస్సు యాత్రలు
🔴 బీసీలలో చైతన్యం కోసం విస్తృత ప్రచారం
🔴 ఉజ్జయినిలో 12వ జాతీయ ఓబీసీ మహాసభ
🔴 సామాజిక న్యాయం, బీసీ ఆత్మగౌరవం కోసం ఉద్యమం
🔴 రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగింపు