bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking Newsచంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్.. బిల్ గేట్స్, బిల్… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 01 Aug 2026, 12:19 pm  |  Posted by : BC7NEWS
👁 79 💬 0
Telangana

చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్.. బిల్ గేట్స్, బిల్ క్లింటన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని వ్యాఖ్య

సీఐఐ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబు నాయుడి పాలనను ప్రశంసించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను గుర్తుచేస్తూ, హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.

బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి ప్రపంచ దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించిన ఘనత చంద్రబాబుదేనని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి కార్యక్రమాలను కొనసాగించడం తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

image

అదే సమయంలో తెలంగాణ అభివృద్ధికి కొత్త ప్రణాళికలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

మరోవైపు, స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, విదేశీ భాషల శిక్షణ, టామ్‌కామ్ ద్వారా విదేశీ ఉద్యోగాల కోసం పూర్తి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

యువతను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయడం, పెట్టుబడులకు తెలంగాణను ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.