bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking NewsNEET Leak Protest: జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్.. ఇంటర్నెట్,… › e-Paper Clip bc7news.in Daily News – Andhra, Telangana, Business & Breaking News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 24 Jul 2026, 11:02 am  |  Posted by : BC7NEWS
👁 9 💬 0
National News

NEET Leak Protest: జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలకు బ్రేక్

NEET Leak Protest: జంతర్‌ మంతర్‌ వద్ద హైటెన్షన్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలకు బ్రేక్

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశ రాజధానిలో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. జంతర్‌ మంతర్‌ వేదికగా విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

నిరసనలు తీవ్రతరం కావడంతో జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. జూలై 23 సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు. జంతర్‌ మంతర్‌ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు.

నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు నిరసనలు చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఇటీవల జరిగిన ‘చలో పార్లమెంట్‌’ కార్యక్రమంలో పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జి చేశారనే ఆరోపణలపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండిస్తూ రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు నిరసనల్లో పాల్గొన్నారు.

‘విద్యార్థులు ఒంటరి కాదు.. విపక్షం అండగా ఉంది’ అంటూ విపక్ష నేతలు గాంధీ స్మృతి వనం వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించారు. నీట్‌ పేపర్‌ లీకేజీతో మనస్తాపానికి గురైన విద్యార్థులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. దీంతో ఢిల్లీలో నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.